![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -35 లో.. రామలక్ష్మి తన నాన్నని కాపాడుకోవడానికి మళ్ళీ వేరొక ఊరుకి సామాను సర్దుకొని బయలుదేర్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా బయపడుకుంటూ ఉండాలని రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత బాధపడుతుంది. ఆ సర్ మళ్ళీ వస్తారా అని పింకీ భయపడుకుంటూ.. నాన్నని ఏమైనా చేస్తారా అని ఏడుస్తుంది. లేదు నేను ఉన్నాను. నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటానని పింకీకి రామలక్ష్మి ధైర్యం చెప్తుంది.
ఆ తర్వాత నాకు తెలుసు అమ్మ నువ్వు మన కుటుంబానికి అండగా ఉంటావని అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత మాణిక్యం ఆ సిచువేషన్ లో కూడా డ్రింక్ చేస్తూ ఓవర్ గా మాట్లాడుతుంటే రామలక్ష్మి, సుజాతలకి కోపం వస్తుంది. ఇప్పుడు నన్ను ఇలా తిరిగిస్తున్నారు కదా.. నేను కూడా వాళ్ళని తిరిగించే రోజు వస్తది.. అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను. ఏదో ఒక ఆయుధం ఖచ్చితంగా దొరుకుతుందని మాణిక్యం అనుకుంటాడు. మరొకవైపు శ్రీలత డాక్టర్ తో సిరి కండిషన్ గురించి మాట్లాడుతుంది. బానే ఉంది బ్లడ్ బాగా పోయింది.. అమ్మాయికి చూస్తే ఇంకా పెళ్లి కానట్టుంది. మీకు ఒక విషయం చెప్పాలని డాక్టర్ అనగా.. ఏంటని శ్రీలత అడుగుతుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పగానే శ్రీలత షాక్ అవుతుంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి అని డాక్టర్ కి శ్రీలత చెప్తుంది.
ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావ్ అమ్మ.. ఈ అన్నయ్య గుర్తుకు రాలేదా అని సిరి దగ్గరికి వెళ్లిన సీతాకాంత్ అడుగుతాడు. ధనని మర్చిపోమని చెప్పావ్ కానీ నా వల్ల కాదు అందుకే అని సిరి అంటుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. సీతాకాంత్ కి ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. శ్రీలత తన మావయ్యని శ్రీవల్లిని బయటకు పంపించి.. సిరి ఒక్కదానితోనే మాట్లాడుతుంది. ఎందుకు ఇలా తప్పు చేసావ్? పెళ్లి కాకముందే తల్లి అవుతున్నావంటూ సిరిని శ్రీలత కొడుతుంది. దాంతో సిరి షాక్ అవుతుంది. నీ కడుపులో పెరుగతున్న బిడ్డని నేను చంపేస్తానని సిరితో శ్రీలత అంటుంది. నేను ఒప్పుకోనని సిరి అనగానే.. ఆ కడుపుకి కారణం అయిన వాన్ని చంపేస్తానని శ్రీలత కోపంగా మాట్లాడుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పకని సిరికి శ్రీలత చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు రామలక్ష్మి వాళ్ళ వేరొక ఇంటికి చేరుకొని సామాను సర్దుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |